వేసవిలో సూర్య – సమంతల సినిమా మొదలు కానుందా?

వేసవిలో సూర్య – సమంతల సినిమా మొదలు కానుందా?

Published on Mar 6, 2013 4:03 AM IST

surya-samantha

సౌత్ లో ఇద్దరు అగ్ర తారలైన సూర్య – సమంతలు ఒక యాక్షన్ ఎంటర్టైనర్ కోసం జత కట్టనున్నారు. ఈ చిత్రానికి ఇంకా పేరు ఖరారు చెయ్యలేదు. ‘పైయ్యా’, ‘వెట్టై’ సినిమాల దర్శకుడు లింగుస్వామి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే సమంత, సూర్య ఈ సినిమాకి తమ తమ డేట్స్ ఇచ్చేసారు. ఈ సినిమా ఏప్రిల్ నుండి మొదలుకానుంది. సూర్య, సమంత కలయికలో ఇదే మొదటి సినిమా. తెలుగులో అగ్ర కథానాయక అయినా తమిళ్ లో సమంత ఇంకా పేరు సంపాదించుకోవాలి.

ఇప్పటివరకూ ఎస్. ఎస్. రాజమౌళి తీసిన ‘నాన్ ఈ ‘ పెద్ద హిట్ గా, గౌతం మీనన్ తీసిన ‘నీతానే ఎన్ పోన్వసంతం’ ఏవరేజ్ గా పేరు తెచ్చుకుంది. ఈ చిత్రంలో సూర్య సరసన నటించడంతో సమంతకి తమిళ్ లో ఇదే పెద్ద సినిమా కానుంది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుపుతారు. ప్రస్తుతం సూర్య ‘సింగం 2’ షూటింగ్లో భాగంగా సౌత్ ఆఫ్రికా లో బిజీగా ఉన్నాడు. సమంత పవన్ కళ్యాణ్ తో నటిస్తున్న సినిమాలో హైదరాబాద్లో చిత్రీకరణలో పాల్గుంటుంది.

తాజా వార్తలు