మే 15 నుండి బాలకృష్ణ -బోయపాటి సినిమా

మే 15 నుండి బాలకృష్ణ -బోయపాటి సినిమా

Published on Mar 4, 2013 4:22 PM IST

Balakrishna-Boyapati

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుంది. ఈ విషయాన్ని మేము ఇంతకు ముందే చెప్పడం జరిగింది. ఈ సినిమా లాంచనంగా మే మూడవ వారం నుండి షూటింగ్ జరుపుకోనుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ – ప్రొడక్షన్ జరుగుతోంది. ఈ సినిమా ఒక పవర్ ఫుల్ రాజకీయ డ్రామాతో తెరకెక్కనుందని, బాలకృష్ణ ఈ సినిమాలో కొత్త అవతారంలో కనిపించనున్నాడని సమాచారం. ఈ సినిమాలోని పాత్ర కోసం సన్నగా కనిపించడానికి ప్రయత్నిస్తున్నాడని సమాచారం. ఈ సినిమాకు తాత్కాలికంగా ‘రూలర్’అనే పేరును ఖరారు చేశారు, 2014లో జరిగే జనరల్ ఎన్నికలకు ముందు ఈ సినిమాను విడుదల చేయలనుకుంటున్నారు.

కొన్ని సంవత్సరాల ముందు బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘సింహా’ సినిమా ఘన విజయాన్ని సాదించింది.

తాజా వార్తలు