![]() |
విడుదల తేదీ : 09 ఫిబ్రవరి 2013 | |
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5 |
||
దర్శకుడు : రెమో డిసౌజా |
||
నిర్మాత : పి.కిషోర్ | ||
సంగీతం : సచిన్, జిగార్ |
||
నటీనటులు : ప్రభు దేవా, సల్మాన్ యూసఫ్ ఖాన్ |
డాన్స్ ఆధారంగా తెరకెక్కిన సినిమాలు తెలుగులో తక్కువే వచ్చాయి కానీ వచ్చినవి మాత్రం విజయాలు అందుకున్నాయి. సాగర సంగమం, స్టైల్ లాంటి సినిమాలు వచ్చి విజయాల్ని అందుకున్నాయి. ప్రభుదేవా, లారెన్స్, రాజు సుందరం, అమ్మ రాజశేఖర్ మాదిరిగా కొరియోగ్రాఫర్స్ దర్శకులుగా మరి సినిమాలు రూపొందించడం కూడా జరిగింది. వీరి జాబితాలో ఇప్పుడు రెమో డిసౌజా కూడా చేరాడు. ప్రభు దేవా ప్రధాన పాత్రలో ‘ఎబిసిడి’ పేరుతో హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా హిందీలో నిన్ననే విడుదల కాగా తెలుగులో ఈ రోజే విడుదలైంది. ఎబిసిడి ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.
కథ :
కేకే మీనన్ కి పెద్ద డాన్స్ స్కూల్ ఓనర్. ఆ డాన్స్ స్కూల్లో బాగా పేరున్న డాన్స్ టీచర్ ప్రభుదేవా. విదేశాల నుండి తీసుకువచ్చిన డాన్స్ టీచర్ కోసం ప్రభు దేవాని ఉద్యోగం నుండి తీసేస్తాడు కేకే మీనన్. నిరాశతో వూరికి వెల్లిపోదాం అనుకున్న సమయంలో అతని స్నేహితుడు గణేష్ ఆచార్య కలిసి ఓదార్చి ఇద్దరూ కలిసి వీధుల్లో ఉండే టాలెంటెడ్ డాన్సర్స్ ని తీసుకుని కొత్తగా ఒక డాన్సు స్కూల్ ప్రారంభిస్తారు.
తన డాన్స్ గ్రూపుతో కేకే మీనన్ మీద ఎలా పగ తీర్చుకున్నాడు అనేది మిగతా చిత్ర కథ.
ప్లస్ పాయింట్స్ :
ఎబిసిడి పేరుకి తగ్గట్లుగానే ఎనీ బడీ కెన్ డాన్సు సినిమా. ఇండియన్ సినిమాల్లో డాన్సు ఆధారంగా ఎన్నో డాన్స్ సినిమాలు వచ్చాయి. ఇందులో కొన్ని డాన్సులు మాత్రం అదిరిపోయాయి. ఈ సినిమాలో డాన్సులు కోరియోగ్రఫీ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ప్రభుదేవా డాన్సు స్టెప్పులతో ఆకట్టుకున్నాడు. ముక్కాలా ముకాబులా థీమ్ సాంగ్ కి వేసిన డాన్సు స్టెప్స్ విజిల్స్ వేయించాయి. మిగతా వారిలో జూనియర్ డాన్సర్స్ అంతా టాలెంట్ చూపించే ప్రయత్నం చేసారు.
మైనస్ పాయింట్స్ :
సెకండ్ హాఫ్ మొత్తం చాలా స్లోగా సాగింది. చాలా సన్నివేశాలు డ్రాగ్ చేయడం వల్ల బోర్ కొట్టింది. కీలకమైన కొన్ని సన్నివేశాల్ని పేలవంగా తీయడం వలన రావాల్సిన ఇంపాక్ట్ రాలేకపోయింది. కథ ఫస్ట్ హాఫ్ లోనే చెప్పేసి ఉండటం వల్ల సెకండ్ హాఫ్ లో స్క్రీన్ప్లే బిగి సడలడం వల్ల ఆసక్తి కలిగించలేకపోయారు.డాన్స్ మూమెంట్స్ చాలా వరకు హాలీవుడ్ సినిమా నుండి ఇన్స్పైర్ అయి కంపోస్ చేసుకున్నారు. అనవసరమైన సీక్వెన్స్ లో 3డి ఎఫెక్ట్ వాడటం వలన మూడ్ డిస్ట్రబ్ అవుతుంది.
సాంకేతిక విభాగం :
సచిన్, జిగర్ పాటలు హిందీ వరకు బాగానే ఉన్నా తెలుగు విషయానికి వచ్చేసరికి మాత్రం సరైన జాగ్రత్త తీసుకోకపోవడంతో తేలిపోయాయి. సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బావుంది. ఒక నిమిషం పాటు వేసే డాన్స్ సీక్వెన్స్ లో సినిమాటోగ్రఫీ వర్క్ బావుంది. 3డి ఎఫెక్ట్ అంతంతమాత్రమే. పైగా మన ఇండియన్ సినిమాల్లో 3డి పూర్తిస్థాయిలో డెవలప్ కాలేదు. ఇందులో 3డి అంతగా ఇంపాక్ట్ చూపించలేదు. డైలాగ్స్ సాధారణంగా ఉన్నాయి.
తీర్పు :
డాన్సులు ఎక్కువగా ఇష్టపడేవారు, డాన్స్ ఆధారంగా తీసే సినిమాలు నచ్చేవారు ఒకసారి చూడతగ్గ సినిమా ఎబిసిడి.
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
అశోక్ రెడ్డి .ఎమ్