‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తూర్పు గోదావరి జిల్లాలో ఎంతో విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ సినిమా బిజినెస్ మెన్ మొదటి వారం రికార్డ్ కలెక్షన్స్ ని క్రాస్ చేసింది. బిజినెస్ మేన్ మొదటివారంలో కలెక్ట్ చేసిన రికార్డ్ ని సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా కేవలం 6 రోజుల్లోనే క్రాస్ చేసింది. తూర్పు గోదావరికి సంబందించిన కలెక్షన్ రిపోర్ట్ మాకు అందింది. సీతమ్మ వాకిట్లో.. సినిమా 6 రోజులకి 2.26 కోట్ల షేర్ సాదించింది, బిజినెస్ మేన్ మొదటివారం 2,25,96,000 రూపాయల షేర్ కలెక్ట్ చేసింది.
కనుమ రోజు (మంగళవారం) లేబర్ కి సెలవు ఉండడం, అలాగే సినిమాకి ఫుల్ పాజిటివ్ టాక్ రావడంతో సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. నైజాంలో కూడా మొదటివారం షేర్ తో రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. విక్టరీ వెంకటేష్ – సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నదమ్ములుగా నటించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించగా, శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసాడు.