అందాల భామ నయనతార లైఫ్ లో ఇప్పటికే పలు స్వీట్ మోమెంట్స్ ని ఆస్వాదించింది. నయనకి కార్లు అంటే చాలా ఇష్టం అలాగే ఆమె వాడే డ్రెస్సుల్లో మంచి టేస్ట్ కనిపిస్తుంది. ఈ భామకి ప్రత్యేకంగా ప్లాటినంతో చేసిన రింగ్స్ అంటే మహా ఇష్టమట. నయనతార దగ్గర కొన్ని ప్లాటినం రింగ్స్ ఉన్నాయి, వాటికి తోడుగా కొన్ని కొత్త కలెక్షన్స్ ని జత చేసింది. అలాగే తనకి బంగారు ఆభరణాలు నచ్చవని చెప్పింది.
ప్రస్తుతం నయనతార నాగార్జున సరసన ఓ తెలుగు సినిమాలో నటిస్తోంది అలాగే కొన్ని తమిళ సినిమాలు చేస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఫుల్ బిజీగా ఉంటూ బాగా సంపాదిస్తోంది. త్వరలోనే నయనతారకి తన ప్లాటినం రింగ్స్ కలెక్షన్ పెంచుకునే అవకాశం వస్తుందని ఆశించవచ్చు.