వాలెంటైన్స్ డేకి రానున్న 3జి లవ్

వాలెంటైన్స్ డేకి రానున్న 3జి లవ్

Published on Jan 16, 2013 10:04 PM IST

3g-love
గోవర్ధన్ కృష్ణ డైరెక్టర్ గా పరిచయమవుతూ చేస్తున్న ‘3జి లవ్’ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రతాప్ కొలగట్ల ఈ సినిమాకి నిర్మాత. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో 15 మంది హీరోలు, 15 మంది హీరోయిన్స్ ఉంటారు. ఈ మూవీ ప్రొడక్షన్ టీం ప్రత్యేకమైన పబ్లిసిటీ చేస్తునారు.

సినీ ప్రేమికులు ఎవరైనా సరే 08922223337 నెంబర్ కి మిస్సుడ్ కాల్ ఇస్తే చాలు, వారు ఫ్రీగా మీ నెంబర్ కి ఈ మూవీ అప్డేట్స్ పంపిస్తారు. ఈ సినిమాని ఇప్పుడున్న జెనరేషన్ కి తగ్గట్టుగా ఉండే రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీగా అంచనా వేస్తున్నారు.

తాజా వార్తలు