ఆయనకున్నంత స్క్రిప్ట్ నాలెడ్జ్ ఎవరికీ లేదు – మహేష్ బాబు

ఆయనకున్నంత స్క్రిప్ట్ నాలెడ్జ్ ఎవరికీ లేదు – మహేష్ బాబు

Published on Jan 16, 2013 6:49 PM IST

SVSC
సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటిసారి విక్టరీ వెంకటేష్ తో కలిసి నటించి తోల్ల్య్వుడ్లో ట్రెండ్ సెట్ చేసిన సినిమా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. ఈ రోజు విజయవాడలో జోస్ అలుక్కాస్ షాప్ ప్రారంభోత్సవానికి హాజరైన మహేష్ బాబు ఆ కార్యక్రమం పూర్తి కాగానే కాసేపు పత్రికా విలేఖరులతో ముచ్చటించారు.

‘వెంకటేష్ గారితో కలిసి పనిచేసిన అనుభూతిని నేను ఎప్పటికీ మరచిపోలేను. సినిమా ఒప్పుకున్న తర్వాత ఆయన ఎంతో అంకితభావంతో పనిచేస్తారు. అలాగే స్క్రిప్ట్ విషయంలో ఆయనకి ఉన్నంత నాలెడ్జ్ ఇక ఏ హీరోకి ఉండదు. నాకు తెలిసి ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో శ్రీకాంత్ అడ్డాలకి చాలా హెల్ప్ చేసి ఉంటారు. నటుడిగా అయన దగ్గరనుంచి చాలా నేర్చుకున్నాను. అలాగే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుని మల్టీ స్టారర్ సినిమా అని ప్రక్కదారి పట్టిస్తున్నారు, అలా చెయ్యొద్దు. ఇది ఒక గొప్ప సినిమా’ అని మహేష్ బాబు అన్నారు.

ఈ ప్రెస్ మీట్లో మహేష్ బాబుతో పాటు ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ శ్రీ కాంత్ అడ్డాల కూడా పాల్గొన్నారు.

తాజా వార్తలు