గౌతం కార్తీక్ మరియు తులసి నాయర్ త్వరలో మణిరత్నం చిత్రం “కడలి” లో కనిపించనున్నారు. ఈ చిత్ర ట్రైలర్ కి అద్భుతమయిన స్పందన కనిపించింది. ఈ ట్రైలర్ లో గౌతం మరియు తులసి ల మధ్యన ముద్దు సన్నివేశం అందరి ఆకట్టుకున్నది. ఇద్దరికీ ఇదే తొలి చిత్రం, గౌతం కి 23 మరియు తులసి కి 15 ఏళ్ళు. ఈ సన్నివేశం గురించి గౌతం ని ప్రశ్నించగా “మణిరత్నం గారు నాకు ఆ సన్నివేశం చెప్పనే లేదు లొకేషన్ లో చేసేయమని అడిగారు ఆయనకి అది సహజ సిద్దంగా ఉండాలని అడిగారు” అని చెప్పారు.
లక్ష్మి మంచు, అరవింద్ స్వామి మరియు అర్జున్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం మంచికి చెడుకి మధ్య జరిగే పోరాటంగా ఉండనుంది. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా రాజీవ్ మీనన్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 1న విడుదల కానుంది.