అందరిలో ఆసక్తి రేపిన “ఓం” మేకింగ్ వీడియో

అందరిలో ఆసక్తి రేపిన “ఓం” మేకింగ్ వీడియో

Published on Jan 15, 2013 12:56 AM IST

Kalyan_Ram_upcoming_3D
దాదాపు సంవత్సరంగా నిర్మాణ దశలో ఉన్న కళ్యాణ్ రామ్ “ఓం” చిత్రం భారతదేశంలో 3డి లో చిత్రీకరిస్తున్న మొదటి యాక్షన్ చిత్రం కానుంది. ఇంత భారీ ఎత్తున చిత్రాన్ని నిర్మించడం కళ్యాణ్ రామ్ కి ఇదే మొదటిసారి. ఈ చిత్ర ప్రీ -ప్రొడక్షన్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చాలా సమయం తీసుకుంటున్నాయి. ఈ చిత్రం కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఈ చిత్రాన్ని 5K రిసోల్యుషన్ లో చిత్రీకరించారు. కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం విడుదలయిన ఈ చిత్ర మేకింగ్ వీడియో అందరి దృష్టిని ఆకట్టుకుంది త్వరలో ఈ చిత్ర టీజర్ ను విడుదల చెయ్యనున్నారు. చూస్తుంటే ఈ చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలు చివరి దశలో ఉన్నట్టు తెలుస్తుంది.ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన కృతి కర్బంధ మరియు సన ఖాన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు దర్శకత్వం సునీల్ రెడ్డి అందిస్తున్నారు. అచ్చు సంగీతం అందిస్తుండగా అజయన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

తాజా వార్తలు