వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కమల్ ఏమన్నారంటే..

వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కమల్ ఏమన్నారంటే..

Published on Mar 2, 2021 5:05 PM IST

కోవిడ్ ప్రభావం నుండి దేశం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. సొంత వ్యాక్సిన్ తయారుచేసిన ప్రభుత్వం డిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టింది. ఇప్పుడిక ఎవరైనా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. కానీ ప్రజల్లో మాత్రం వ్యాక్సినేషన్ పట్ల అనేక అనుమానాలున్నాయి. వ్యాక్సిన్ వేయించుకుంటే ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయేమోనని అనుమానపడుతున్నారు. అందుకే ప్రముఖులు నేరుగా వ్యాక్సినేషన్ చేయించుకుని ప్రజల్లో అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

తాజాగా విశ్వనటుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ వ్యాక్సినేషన్ చేయించుకున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్నాక ఆయన జనానికి సందేశం కూడ ఇచ్చారు. ‘శ్రీ రామచంద్రన్ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ చేయించుకున్నాను. వెంటనే శరీరం మొత్తం రోగ నిరోధకంగా మారింది. అవినీతికి వ్యతిరేకంగా వ్యాక్సినేషన్ వచ్చే నెల ఉంటుంది. సిద్ధంగా ఉండండి’ అంటూ త్వరలో జరగబోయే తమిళనాడు ఎన్నికలను గురించి ప్రస్తావించారు. ఇకపోతే కమల్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘విక్రమ్’ సినిమ్లో నటిస్తున్నారు.

తాజా వార్తలు