మన టాలీవుడ్ లో అంశం ఏదైనా సరే ఎవరికి అయినా ఇబ్బందులు ఉన్న కూడా మొట్ట మొదటగా స్పందించే వ్యక్తులలో మెగాస్టార్ చిరంజీవి ముందుంటారు. మరి అలాగే గతంలో కరోనా ప్రబలుతున్న సమయంలో తెలుగు సినీ కార్మికుల కోసం ఎంత సాయం అందించారో తెలిసిందే.
అలాగే సినిమా షూటింగ్స్ కోసం కూడా తెలంగాణా ప్రభుత్వంతో మాట్లాడి తనదైన పాత్ర పోషించారు. అయితే ఇప్పుడు చిరు గౌరవ తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కు ముందు గానే తన జన్మదిన శుభాకాంక్షలను సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు.
“పచ్చదనాన్ని ప్రేమించే సీఎం కేసీఆర్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.MP సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోటి వృక్షార్చన లో భాగస్వాములమయ్యి మొక్కలు నాటటం మనం శ్రీ కెసిఆర్ గారికి ఇచ్చే కానుక.అందరం మొక్కలు నాటుదాం…వాటిని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకుందాం.” అని ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసారు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ కొరటాల దర్శకత్వంలో “ఆచార్య” అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
పచ్చదనాన్ని ప్రేమించే సీఎం కేసీఆర్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.MP సంతోష్ కుమార్ గారు చేపట్టిన #GreenIndiaChallenge కోటి వృక్షార్చన లో భాగస్వాములమయ్యి మొక్కలు నాటటం మనం Shri.KCR గారికి ఇచ్చే కానుక.అందరం మొక్కలు నాటుదాం…
వాటిని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకుందాం.— Chiranjeevi Konidela (@KChiruTweets) February 16, 2021