ఈ నెలాఖరులో మొదలు కానున్న త్రివిక్రమ్ – పవన్ కళ్యాణ్ ల చిత్రం

ఈ నెలాఖరులో మొదలు కానున్న త్రివిక్రమ్ – పవన్ కళ్యాణ్ ల చిత్రం

Published on Jan 6, 2013 9:35 AM IST


పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో రానున్న చిత్రం జనవరి 22న మొదలు కావడానికి సకలం సిద్దం అయ్యింది. పవన్ కళ్యాణ్ సరసన సమంత కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఫ్యామిలి ఎంటర్ టైనర్ గా తెరకెక్కనుంది. చాలా రోజుల తరువాత త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న పూర్తి స్థాయి ఫ్యామిలి ఎంటర్ టైనర్ ఈ చిత్రం. ఇందులో మానవవిలువల గురించి కథ ఉంటుంది అని త్రివిక్రమ్ తెలిపారు. డిసెంబర్లో లొకేషన్ లు వెతకడానికి పవన్ -త్రివిక్రమ్ స్పెయిన్ వెళ్ళారు. చిత్రంలో చాలా భాగం అక్కడే చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది.

సమంత కాకుండా ఈ చిత్రంలో మరో కథానాయిక కూడా నటిస్తుంది తాజా సమాచారం ప్రకారం ఈ పాత్ర కోసం ప్రణీతను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తుంది. గతంలో “బావ” మరియు “శకుని” వంటి చిత్రాలలో కనిపించిన ఈ భామ తెలుగులో చేస్తున్న మొదటి పెద్ద చిత్రం ఇదే. ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు ఈ చిత్రాన్ని బివి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు