సిద్దమవుతోన్న సీతమ్మ వాకిట్లో.. మొదటి కాపీ

సిద్దమవుతోన్న సీతమ్మ వాకిట్లో.. మొదటి కాపీ

Published on Jan 5, 2013 11:10 AM IST

SVSC-5

టాలీవుడ్ మరియు సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక సినిమా ‘ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. విక్టరీ వెంకటేష్ – సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నదమ్ములుగా చేసిన ఈ మల్టీ స్టారర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. ఈ మూవీ ఫస్ట్ కాపీ రేపు సాయంత్రంలోగా సిద్దమవుతుందని సమాచారం. రీ రికార్డింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డి.టి.ఎస్ మిక్సింగ్ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ మూవీకి మణిశర్మ రీ రికార్డింగ్ అందించారు.

జనవరి 11న విడుదల చేయాలనుకుంటున్న ఈ సినిమా ప్రీమియర్ షోస్ జనవరి 10న వేయాలని ప్లాన్ చేస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ మ్యూజిక్ కంపోస్ చేసాడు. దిల్ రాజు నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రానికి పండుగ సీజన్ కావడంతో బిజినెస్ కూడా బాగా జరుగుతోందని సమాచారం.

తాజా వార్తలు