యదార్థ సంఘటన ఆధారంగా “జెండా పై కపిరాజు”

యదార్థ సంఘటన ఆధారంగా “జెండా పై కపిరాజు”

Published on Jan 5, 2013 3:50 AM IST

Jenda-Pai-Kapiraju
నాని మరియు అమలా పాల్ ప్రధాన పాత్రలలో వస్తున్న “జెండా పై కపిరాజు” చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. సముధ్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కె ఎస్ శ్రీనివాసన్ నిర్మిస్తున్నారు ఈ చిత్రం గురించి సముద్రఖని మాట్లాడుతూ ” ఈ చిత్రం గత ఆరు నెలల్లో వచ్చిన పలు అంశాలను మీకు గుర్తు చేస్తుంది ఈ చిత్రం ఒక యదార్థ ఘటన ఆధారంగా తీస్తున్నాం ఎప్పుడూ అబద్దం చెప్పని నా స్నేహితుడు ఒకడు ఈ మధ్య అమెరికా వెళ్ళిపోయాడు, ఎందుకు అని అడిగితే ఇంత అవినీతి ఉన్న దేశంలో నేను ఉండలేను అని చెప్పాడు. ఈ సంఘటన ఆధారంగా నేను ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నా, నాని మరియు అమలా పాల్ ఈ చిత్రానికి సరిగ్గా సరిపోయారు” అని అన్నారు.

ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నారు అయన కెరీర్ లో ఇదే మొదటిసారి. అమలా పాల్ ఈ చిత్రంలో సాధారణ యువతిలా కనిపించనుంది. జి వి ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

తాజా వార్తలు