జనవరి చివర్లో రానున్న బ్యాడ్ బాయ్

జనవరి చివర్లో రానున్న బ్యాడ్ బాయ్

Published on Jan 4, 2013 5:55 PM IST

Bad-Boy
తమిళ స్టార్ కార్తీ హీరోగా నటించిన ‘బ్యాడ్ బాయ్’ సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది తమిళంలో తెరకెక్కిన ‘అలెక్స్ పాండ్యన్’ సినిమాకి డబ్బింగ్. మొదటి సారి కార్తీ సరసన అనుష్క జోడీ కట్టిన ఈ సినిమాని స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మించారు. సూరజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ పలు సార్లు వాయిదా పడింది.

ప్రొడక్షన్ టీం ముందుగా ఈ సినిమాని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకున్నారు, కానీ తెలుగులో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ‘ – ‘నాయక్’ లాంటి క్రేజీ సినిమాలు ఉండటం వల్ల 25కి వాయిదా వేసారు. కార్తీ తనకి కమర్షియల్ గా మంచి సక్సెస్ ఇస్తుందని ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు.

తాజా వార్తలు