లేడీస్ కి ప్రత్యేకంగా సీతమ్మ వాకిట్లో… షో.!

లేడీస్ కి ప్రత్యేకంగా సీతమ్మ వాకిట్లో… షో.!

Published on Jan 4, 2013 3:31 PM IST

SVSC
విక్టరీ వెంకటేష్ – సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నదమ్ములుగా తెరకెక్కిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా మొదలైనప్పటి నుంచి ఏదో ఒక సంచలనాన్ని సృష్టిస్తోంది. ఇప్పుడు మరో కొత్త సంచలనానికి సిద్దమైంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాని నెల్లూరులోని ఐనాక్స్ థియేటర్లో 11వ తేదీ మాట్నీ షో కేవలం లేడీస్ కి మాత్రమే వేయనున్నారు. ఇది ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడదగ్గ సినిమా కావడంతో ప్రత్యేకంగా లేడీస్ కి మాత్రమే ఒక షో వెయ్యాలని డిస్ట్రిబ్యూటర్ నిర్ణయించుకున్నాడు.

దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. సమంత – అనజలి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఈ రోజు విడుదల చేసిన సాంగ్ టీజర్ అంచనాలను ఇంకా పెంచేస్తోంది.

తాజా వార్తలు