సంక్రాంతి రేస్ లో “విశ్వరూపం”

సంక్రాంతి రేస్ లో “విశ్వరూపం”

Published on Jan 3, 2013 4:00 PM IST

Vishwaroopam
కమల్ హాసన్ రాబోతున్న చిత్రం “విశ్వరూపం” అధికారికంగా సంక్రాంతి పరుగులో చేరింది. గతంలో ఈ చిత్ర తెలుగు వెర్షన్ ని తమిళ వెర్షన్ తో పాటు విడుదల చేసే అవకాశాలు లేవని వార్తలు వచ్చాయి. తమిళ వెర్షన్ విడుదల అయిన రెండు వారాల తరువాత తెలుగు వెర్షన్ ని విడుదల చేస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. కాని తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం జనవరి 11న విడుదలకు సిద్దమయ్యింది. ఈ చిత్రాన్ని ఆంధ్ర ప్రదేశ్ మొత్తం సిరి మీడియా ద్వారా దాసరి నారాయణ రావు పంపిణి చేస్తున్నారు. ఈ చిత్ర ఆడియో విడుదల సందర్భంగా దాసరి నారాయణ రావు జనవరి 10న DTHలో చిత్ర ప్రీమియర్ ప్రదర్శించాలన్న కమల్ హాసన్ నిర్ణయాన్ని అభినందించారు. “విశ్వరూపం” చిత్రాన్ని కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. పూజ కుమార్, ఆండ్రియా, రాహుల్ బోస్ మరియు శేఖర్ కపూర్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తుండగా శంకర్-ఎహాసన్-లాయ్ త్రయం ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం తెలుగులో భారీ చిత్రాలు “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ” మరియు “నాయక్” చిత్రాలతో పోటీ పడనుంది.

తాజా వార్తలు