శ్రియ ‘పవిత్ర’

శ్రియ ‘పవిత్ర’

Published on Jan 3, 2013 6:17 PM IST

pavitra2
తెలుగులో టాప్ హీరోలు, యువ హీరోలందరి సరసన నటించిన శ్రియ శరన్ ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించనుంది. ఈ మధ్య లేడీ ఓరియెంటెడ్ పాత్రల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్న శ్రియ ‘పవిత్ర’ అనే సినిమాలో నటిస్తుంది. అయితే ఈ సినిమాలో శ్రియ సెక్స్ వర్కర్ గా నటించబోతున్నట్లు సమాచారం. చాల మంది హీరోయిన్స్ కెరీర్ చివర్లో ఇలాంటి వేశ్య పాత్రలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. జనార్ధన మహర్షి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని ఆదేష్ ఫిలింస్ బ్యానర్ పై కె. సాధక్ కుమార్, జి. మహేశ్వర రెడ్డి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎం. ఎం శ్రీలేఖ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ రోజే విడుదలైంది.

తాజా వార్తలు