పూరి జగన్నాధ్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలయికలో మళ్లీ మరో సినిమా వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో బద్రీ, ‘కెమెరా మెన్ గంగతో రాంబాబు’ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటివలే పవన్ కళ్యాణ్ కు పూరి కథను వినిపించాడని కూడా వార్తలు వచ్చాయి. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం పవన్ – పూరి కలయికలో సినిమా రాబోతోందని తెలుస్తోంది. మరో రెండేళ్ల తరువాతే వీరి కలయికలో సినిమా ఉంటుందని తెలుస్తోంది.
అన్నట్టు భారత దేశంలో అవినీతి జాఢ్యం నేపథ్యంలో ఈ కథను పూరి రాస్తున్నాడట. అంటే ఈ కథ మొత్తం మన వ్యవస్థలో లోపాల చుట్టూ, అలాగే మన న్యాయ వ్యవస్థలోని డొల్లతనం చుట్టూ కథ సాగుతుందట. ఇక ఈ కరోనా టైమ్ లో సినిమా దర్శకులుకు కొత్త కథలు రాసుకోవడానికి మంచి అవకాశం.. అందుకే ఇప్పటికే చాలామంది దర్శకులు తమ తరువాత సినిమాల కథలను పూర్తి చేశారు.
అయితే పూరీ గతంలో మహేష్ బాబుతో చేయాలనుకున్న ఈ సినిమాను పవన్‌తో చేయనున్నాడట. పూరి మదిలో వున్న ‘జనగనమణ’ సినిమా స్క్రిప్ట్ ను రెడీ చేసి, పూరి పవన్ కి వినిపించాడని అంటున్నారు.