రవితేజ సినిమా ఇక లేనట్టేనా ?

రవితేజ సినిమా ఇక లేనట్టేనా ?

Published on Dec 25, 2020 12:00 AM IST

మాస్ మహారాజ రవితేజ ఈమధ్య కాలంలో వరుసగా సినిమాలు సైన్ చేశారు. చాలా రకాల కథలు విన్న ఆయన మూడు సినిమాలను చేయాలని అనుకున్నారు. వాటిలో గోపీచంద్ మలినేని ‘క్రాక్’ ఒకటి కాగా రమేష్ వర్మతో ‘ఖిలాడీ’ రెండో చిత్రం. వీటిలో ‘క్రాక్’ షూటింగ్ ముగించుకుని విడుదలకు సిద్దమవుతోంది. ప్రస్తుతం ‘ఖిలాడీ’ షూటింగ్లో ఉన్నారు మాస్ మహారాజ. అయితే ఈ సినిమాలతో పాటే మారుతి దర్శకత్వంలో కూడ ఒక సినిమా చేయాలని అనుకున్నారు రవితేజ. కథ నచ్చడం, యువీ క్రియేషన్స్ నిర్మాణానికి ముందుకు రావడంతో ఇక సినిమా మొదలుకావడమే ఆలస్యం అనుకున్నారు.

మారుతి అంటేనే ఎంటర్టైన్మెంట్ సినిమాకు కేరాఫ్ అడ్రెస్. ‘మహానుభావుడు, భలే భలే మగాడివోయ్, ప్రతిరోజూ పండగే’ లాంటి హిట్ సినిమాలున్నాయి ఆయన ఖాతాలో. వీరిద్దరి కాంబినేషన్ అనగానే ప్రేక్షకులు కూడ భారీ ఎంటర్టైనర్ ఆశించారు. కానీ ఉన్నట్టుండి వీరి ప్రాజెక్ట్ ఆగిపోయినట్టు వార్తలొస్తున్నాయి. కారణాలు తెలియలేదు కానీ రవితేజ సినిమా నుండి తప్పుకున్నారని అంటున్నారు. మారుతి కూడ ఇదే కథను వేరొక హీరోకు వినిపించే ప్రయత్నాల్లో ఉన్నారని, మోస్ట్లీ ఆ హీరో గోపిచంద్ అయి ఉండొచ్చని చెబుతున్నారు. సినిమా అఫీషియల్ గా ప్రకటించబడలేదు కాబట్టి ఆగిపోయినట్టు అఫిషియల్ కన్ఫర్మేషన్ ఉండకపోవచ్చు. మొత్తానికి మారుతి, మాస్ మహారాజ్ కాంబినేషన్లో సినిమాను ఆశించిన ప్రేక్షకులకు ఒకింత నిరాశే మిగిలింది.

తాజా వార్తలు