లాక్ డౌన్ అనంతరం చెప్పుకోదగిన స్థాయిలో విడుదలవుతున్న చిత్రం సాయి ధరమ్ తేజ్ చేసిన ‘సోలో బ్రతుకే సో బెటర్’. ఈ సినిమా కంటే ముందు కొన్ని చిన్న సినిమాలు అతి కొద్ది సంఖ్యలో థియేటర్లలో విడుదలైనప్పటికీ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటున్న చిత్రం కావడం, ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో విడుదలవుతుండటంతో ‘సోలో బ్రతుకే’ విడుదల ప్రాముఖ్యతను సంతరించుకుంది. సినీ ప్రముఖులంతా లాక్ డౌన్ తర్వాత చేస్తున్న మొదటి విడుదల కాబట్టి ఇండస్ట్రీలోని అనేక సినిమాల విడుదల ప్లానింగ్స్ ఈ సినిమా ఫలితం మీదే ఆధారపడి ఉంటాయని అంటున్నారు.
స్టార్ హీరోలు ప్రేక్షకులను థియేటర్లలోకి వచ్చి ఈ సినిమాను చూడమని చెబుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడ ‘సోలో బ్రతుకే సో బెటర్’ బృందానికి అభినందనలు తెలుపుతూ ఈ కరోనా పండెమిక్ పరిస్థితుల్లో థియేటర్లలో విడుదలవుతున్న మొదటి సీనియా ఇది. ఇదొక మైల్ స్టోన్ లాంటిది. సాయి ధరమ్ తేజ్ సహా చిత్రం బృందం మొత్తానికి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను అంటూ సందేశం పంపారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహించారు.