తెలుగులో లీడింగ్ డిజిటల్ కంటెంట్ హౌస్‌లో ఒకటిగా పేరు తెచ్చుకుని, గత 5 సంవత్సరాలలో యూట్యూబ్ ఛానెళ్ల నెట్‌వర్క్ ద్వారా 1000కి పైగా వీడియోలను రిలీజ్ చేసి ఎంతో ప్రేక్షకాదరణ పొందిన ఛాయ్ బిస్కెట్ తెలుగులోని ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌస్ మరియు దాని అసోసియేషన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. అయితే ప్రముఖ ఆడియో కంపెనీ లహరి మ్యూజిక్ యొక్క చలన చిత్ర విభాగం లహరి ఫిల్మ్స్ తో కలిసి ఈ చిత్రాలను రూపొందించబోతుంది. అయితే వీరి మొదటి చిత్రం యొక్క ఫస్ట్ లుక్‌ను న్యూ ఇయర్ రోజు విడుదలచేయనున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్బంగా ఛాయ్ బిస్కెట్ కో ఫౌండర్ అనురాగ్ మాట్లాడుతూ ఛాయ్ బిస్కెట్ ఎల్లప్పుడూ మంచి కథలను ఎంచుకుంటుందని తెలిపారు. అలాగే ప్రతిభావంతులైన రచయితలు, నటీనటులు, దర్శకులు మరియు ఇతర కళాకారులకు ఒక వేదికను అందించడమే ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ యొక్క ముఖ్య ఉద్దేశ్యమని, కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తూ సరికొత్త సినిమాలను చేయబోతున్నామని తెలిపారు.
ఇక ఛాయ్ బిస్కెట్ కో ఫౌండర్ శరత్ చంద్ర మాట్లాడుతూ నాణ్యమైన కథలతో క్రొత్త ప్రతిభను ప్రోత్సహించడం మా బలమని, మేము దీన్ని డిజిటల్ ప్రదేశంలో విజయవంతంగా పూర్తి చేశాం మరియు ఫీచర్ ఫిల్మ్ స్థలంలో కూడా అదే విధంగా చేయటానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. లహరి ఫిల్మ్‌తో భాగస్వామ్యం కావడం నిజంగా మంచి అవకాశమని ఇది మాకు మరిన్ని అవకాశాలను కల్పిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.
లహరి మ్యూజిక్, లహరి ఫిల్మ్స్ పార్ట్‌నర్ చంద్రు మనోహర్ మాట్లాడుతూ సంగీత పరిశ్రమలో 45 సంవత్సరాల అనుభవం ఉన్న మాకు నిర్మాణ రంగంపై ఆసక్తి ఏర్పడిందని, ఇప్పటికే కన్నడలో సినిమాలు నిర్మిస్తున్న మేము తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టడానికి ఛాయ్ బిస్కెట్ మాకు సరైన భాగస్వామిగా భావిస్తున్నామని అన్నారు. యంగ్ టాలెంట్, మా ఫిలిసోఫీలు మరియు విజన్ మ్యాచ్ మాకు చాలా ఇష్టమని, మా సంస్థలో యంగ్ టాలెంట్ కు అవకాశం ఇచ్చి మంచి సినిమాలు నిర్మించడానకి సన్నాహాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.
ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ మరియు లహరి మ్యూజిక్ యొక్క అసోసియేషన్ ఇప్పటికే 2021లో అరంగేట్రం చేయబోయే కొంతమంది యువ ప్రతిభావంతులైన దర్శకులతో సినిమాలు రూపొందించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఆ వివరాలను కూడా త్వరలోనే వెల్లడించనున్నట్టు తెలుస్తుంది.