“చిత్ర లహరి”, “ప్రతీరోజూ పండగే” సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని ట్రాక్ లోకి పడ్డ మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ చిత్రం “సోలో బ్రతుకే సో బెటర్” తో హ్యాట్రిక్ గా మలచుకోవాలని చూస్తున్నాడు. మొదటగా టైటిల్ తోనే యూత్ కు కనెక్ట్ అయిపోయిన సాయి తేజ్ లేటెస్ట్ గా విడుదల చేసిన ట్రైలర్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ ను కూడా థియేటర్ కు రప్పించేలా నిలిచాడు. అయితే ఈ కిస్మస్ కానుకగా ప్లాన్ చేసిన ఈ చిత్రం తాలూకా ట్రైలర్ ను నిన్న విడుదల చెయ్యగా దానికి గట్టి రెస్పాన్సే వచ్చింది.
లేటెస్ట్ గానే 50 లక్షల వ్యూస్ మార్క్ క్రాస్ మరిన్ని వ్యూస్ తో దూసుకుపోతుంది. అంతే కాకుండా లక్షకు పైగా లైక్స్ తో పాటుగా యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో నిలిచి ఈసారి సాయి తేజ్ కు మంచి విజయాన్నే అందించేలా కనిపిస్తుంది. అయితే ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్ గా నటించగా నూతన దర్శకుడు సుబ్బు మంచి ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అలాగే థమన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి బి వి ఎస్ ఎం ప్రసాద్ నిర్మాణం వహించారు.