థలపతి “మాస్టర్” తెలుగు స్ట్రామ్ రెడీగా ఉంది.!

థలపతి “మాస్టర్” తెలుగు స్ట్రామ్ రెడీగా ఉంది.!

Published on Dec 16, 2020 12:32 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ థలపతి విజయ్ కు ఇప్పుడు తెలుగులో కూడా మంచి మార్కెట్ సంతరించుకుంటుంది. ఇప్పటికే తాను నటించిన లేటెస్ట్ చిత్రం “మాస్టర్” తమిళ టీజర్ ఇండియాలోనే సెన్సేషనల్ రికార్డులను సృష్టించి ఇప్పటికీ కొనసాగిస్తోంది. లేటెస్ట్ గానే 5 లక్షల కామెంట్స్ తో అదిరిపోయే రికార్డును సెట్ చేసిన ఈ టీజర్ ఇప్పుడు తెలుగులో కూడా సత్తా చాటేందుకు రెడీ అవుతుంది.

ఈ చిత్రాన్ని తెలుగు డబ్ రైట్స్ ప్రముఖ నిర్మాత మహేష్ కోనేరు తీసుకున్న సంగతి తెలిసిందే. వారి బ్యానర్ ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ నుంచి రేపు డిసెంబర్ 17న సాయంత్రం 6 గంటలకు విడుదల కానుంది. ఈ టీజర్ కోసం కూడా మన వాళ్ళు చాలానే ఎదురు చూస్తున్నారు. ఫైనల్ గా ఆ డే ఇపుడు వస్తుంది.

లాస్ట్ టైం “విజిల్” టీజర్ కు కూడా గట్టి రెస్పాన్స్ నే ఇచ్చారు. మరి ఈసారి “మాస్టర్” స్ట్రామ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో టాలెంటెడ్ హీరో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తుండగా మాళవికా మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక అలాగే అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఓ పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాగా లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వం వహించారు.

తాజా వార్తలు