అప్ డేట్ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ వెయిటింగ్ !

అప్ డేట్ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ వెయిటింగ్ !

Published on Nov 23, 2020 2:30 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ కి గతంలో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స జరగడంతో రజినీ కోవిడ్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు బయటకు రాకూడదనే వైద్యుల సలహా మేరకు పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. దాంతో ప్రస్తుతం రజిని చేస్తోన్న కొత్త చిత్రం ‘అన్నాత్తే’ మధ్యలోనే ఆగిపోయింది. డైరెక్టర్ శివ ఇప్పటికే అన్ని షూట్ కి రెడీ చేసి పెట్టుకున్నాడు. కానీ కరోనా పూర్తిగా తగ్గేవరకూ రజినీ సినిమా చేయలేనని ఇప్పటికే స్పష్టం చేశారట. మరోపక్క ఈ సినిమా అప్ డేట్ కోసం సూపర్ స్టార్ ఫాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. మరి వచ్చే వేసవికి అయినా ఈ సినిమా మొదలు అవుతుందో లేదో చూడాలి.

నిజానికి రజనీ ఈ ప్రాజెక్ట్ కోసం బల్క్ డేట్స్ ఇవ్వడమే కాకుండా శివ పై పూర్తి నమ్మకం ఉందని చాల పాజిటివ్ గా చెప్పారు. అందుకే సూపర్ స్టార్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా రజినీ – శివ కాంబినేషన్ పట్ల చాలా ఆసక్తిని చూపిస్తున్నారు. మాస్ హీరోలను ఎలివేట్ చేయడంలో డైరెక్టర్ శివది గొప్ప టాలెంట్ అనే విషయం ఇప్పటికే ఆయన గత సినిమాలు ‘వీరం, వివేగం, వేదాళం, విశ్వాసం’ లాంటి సినిమాలు చూస్తేనే అర్ధం అవుతోంది. అందుకే మొదటి నుండి ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. కీర్తి సురేశ్‌, మీనా, ఖుష్బూలు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తాజా వార్తలు