ఆల్ సెట్ చేసేసిన మెగాస్టార్..కానీ మరో క్లారిటీ లేదు!

ఆల్ సెట్ చేసేసిన మెగాస్టార్..కానీ మరో క్లారిటీ లేదు!

Published on Nov 18, 2020 12:00 PM IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం “ఆచార్య”లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ చిత్రం కూడా అన్ని సినిమాల్లానే లాక్ డౌన్ లో షూట్ వాయిదా పడింది. దీనితో అక్కడ నుంచి మళ్ళీ డేట్స్ మారుతూ లేటెస్ట్ గా ఒక ఫైనల్ డేట్ ను మిగిలి ఉన్న షూట్ కు గాను తీసుకొచ్చుకుంది.

అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం మెగాస్టార్ తన షూట్ నిమిత్తం ఆల్ సెట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ రెండు మూడు రోజుల్లో మెగాస్టార్ తన షూట్ లో పాల్గొననున్నారని అలాగే ఇంతకు ముందు చెప్పిన విధంగానే కాజల్ కూడా డిసెంబర్ లోనే షూట్ కు పాల్గొననున్నట్టు తెలుస్తుంది.

కానీ ఈ చిత్రంలో మరో కీలక పవర్ ఫుల్ రోల్ కు గాను ఎంపిక చేసిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఎప్పుడు పాల్గొంటారో అన్నది ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతానికి అయితే చరణ్ జక్కన్నతో తీస్తున్న “రౌద్రం రణం రుధిరం”లో బిజీగా ఉన్నారు. మరి ఇది అయ్యేసరికి చాలానే టైం ఉంది మరి చరణ్ ఎప్పుడు ఈ షూట్ లో పాల్గొంటారో అన్నది చూడాలి. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటెర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు