కమిట్మెంట్ టీజర్..బోల్డ్ అండ్ రియలిస్టిక్ ప్రయోగం.!

కమిట్మెంట్ టీజర్..బోల్డ్ అండ్ రియలిస్టిక్ ప్రయోగం.!

Published on Nov 18, 2020 10:06 AM IST

సినిమాలను మినిమమ్ ఫాలో అయ్యేవారికి అందరికీ “కమిట్మెంట్” అనే పదం తెలిసే ఉంటుంది. అలాగే దానికి అర్ధం ఏమిటో కూడా తెలుసుకునే ఉంటారు. అయితే ఇప్పుడు అలాంటి సున్నతమైన అంశం మీద తీసిన లేటెస్ట్ అడల్ట్ అండ్ బోల్డ్ అటెంప్ట్ సినిమానే “కమిట్మెంట్”. అన్వేష్ జైన్, తేజస్వి మడివాడ మెయిన్ మేల్ అండ్ ఫిమేల్ లీడ్స్ ల నటిస్తున్న ఈ చిత్రానికి లక్ష్మికాంత్ చెన్న దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రం తాలూకా టీజర్ బయటకొచ్చింది.

ఇక ఈ టీజర్ కోసం మాట్లాడినట్టయితే సినిమా పరంగా ఖచ్చితంగా ఏ సర్టిఫైడ్ అని అర్ధం అయ్యిపోతుంది అందుకు తగ్గట్టుగానే మసాలా కూడా బాగానే దట్టించారు. సజీస్ మరియు నరేష్ ల సినెమాటోగ్రఫీలో విజువల్స్ మరింత బాగున్నాయి. అలాగే నరేష్ కుమరన్ మ్యూజిక్ కూడా టీజర్ కు మంచి ఇంపాక్ట్ ఇచ్చింది. ఇక మెయిన్ కంటెంట్ లోకి వెళ్తే వీరు చెప్పదలచుకున్న కంటెంట్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదని అర్ధం అవుతుంది.

“కమిట్మెంట్” అనే సున్నతమైన పాయింట్ ను ఎలా ఆడియెన్స్ లోకి తీసుకెళ్ళాలో అదే విధంగా తీసుకెళ్లారు. లైఫ్ ఇవ్వడానికి తాము అనుకున్నది ఇవ్వాలి కదా అనే పాయింట్ ను రైజ్ చేస్తూ టీజర్ ను కట్ చేసారు. ఇక అలాగే ఏ ప్రోఫిషెన్ లో ఉన్నా సరే ఆడవాళ్ళకి ఎదురయ్యే ఇబ్బందులను కూడా పలు కోణాల్లో చూపే ప్రయత్నం చేస్తున్నారనిపిస్తుంది. మొత్తానికి మాత్రం ఈ కమిట్మెంట్ ఒక బోల్డ్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రం అని చెప్పొచ్చు. మరి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఈ చిత్రాన్ని ఎలా మలచారో చూడాలి. ఫుట్ లూస్ ఎంటర్టైన్మెంట్స్ మరియు ఎఫ్ 3 ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించిన ఈ చిత్రం తొందర్లోనే విడుదలకు రెడీ కానుంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

తాజా వార్తలు