అప్పుడే కొత్త ప్రాజెక్ట్ షూటింగ్ మొదలుపెట్టేసిన సూర్య

అప్పుడే కొత్త ప్రాజెక్ట్ షూటింగ్ మొదలుపెట్టేసిన సూర్య

Published on Nov 17, 2020 11:03 PM IST


హీరో సూర్య కొత్త చిత్రం ‘ఆకాశం నీ హద్దురా !’ తమిళం, తెలుగు భాషల్లో మంచి టాక్ తెచ్చుకుంది. అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైన ఈ చిత్రాన్ని సుధా కొంగర డైరెక్ట్ చేయడం జరిగింది. విమర్శకులు, ప్రేక్షకులు, సినీ సెలబ్రిటీలు సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సూర్య నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇలా సినిమా విజయాన్ని ఆస్వాదిస్తూనే సూర్య షూటింగ్ మొదలుపెట్టేశారు. ఆయన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వెబ్ సిరీస్ కోసం నటిస్తున్నారు.

ఈ వెబ్ సిరీస్ ను ప్రముఖ దర్శకుడు మణిరత్నం నిర్మిస్తున్నారు. దీనికి ‘నవరస’ అనే పేరును పెట్టారు. మొత్తం తొమ్మిది ఎపిసోడ్లు ఉండబోయే ఈ సంకలనాన్ని తొమ్మిది మంది దర్శకులు డైరెక్ట్ చేయనున్నారు. బిజో నంబియార్‌, కేవీ ఆనంద్‌, గౌతమ్‌ మీనన్‌, కార్తిక్‌ సుబ్బరాజ్‌, పొన్‌రామ్‌, హలిత షలీమ్‌, కార్తీక్‌ నరేన్‌, రతీంద్రన్‌, నటుడు అరవింద స్వామి, హీరో సిద్దార్థ డైరక్ట్ చేయనున్నారు. వీరిలో గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేయబోయే ఎపిసోడ్లో సూర్య ప్రధాన పాత్ర చేస్తున్నారు. అయితే ఇది నవరసాల్లో ఏ రసనైకి చెందింది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఏ. ఆర్‌ రెహమాన్‌, గోవింద్‌ వసంతన్‌, జిబ్రాన్‌ ఈ నవరసాల సంకలనానికి సంగీతం అందిస్తున్నారు

తాజా వార్తలు