పవన్ అయ్యప్పణం రీమేక్ పై ఈ రూమర్స్ తప్పేగా.!

పవన్ అయ్యప్పణం రీమేక్ పై ఈ రూమర్స్ తప్పేగా.!

Published on Nov 17, 2020 10:08 PM IST


ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేపట్టిన పలు ప్రాజెక్ట్ లలో అయ్యప్పణం కోషియం రీమేక్ కూడా ఒకటి. యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర తెరకెక్కించనున్న ఈ చిత్రంపై పవన్ అభిమానులు గట్టి అంచనాలే పెట్టుకున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాపై అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఏదొక రూమర్స్ అండ్ గాసిప్స్ కూడా గట్టిగానే వస్తున్నాయి.

అలా కొన్ని రోజుల కితం కొన్ని వార్తలు వినిపించాయి. ఈ చిత్రంలో కీలక మార్పులు నిమిత్తం పవన్ ఏకంగా మరో పవర్ రోల్ ను అయినటువంటి దానిని తీసేయమన్నారని ఓ రూమర్ రాగా అది విని పవన్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. కానీ దర్శకుడు ఇచ్చిన సమాచారంలో అయితే అలాంటిది ఏమి చెప్పలేదు. మన నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేస్తున్నామని చెప్పారు.

అయితే ఇప్పుడు ఆ రూమర్ పై మరింత క్లారిటీ వస్తుంది. పవన్ కు ఆపోజిట్ రోల్ కు గాను ఇంకా చర్చలు సాగుతున్నాయట. లేటెస్ట్ గా టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ పేరు కూడా ఇప్పుడు రేస్ లోకి రావడం గమనార్హం. సో పవన్ ఆ రోల్ ను తీసేయమన్నారు అని వచ్చిన రూమర్స్ అన్ని తప్పే అని ఇప్పుడు అనుకోవచ్చు.

తాజా వార్తలు