పవన్ సినిమా కోసం త్రివిక్రమ్ కు భారీగానే…!

పవన్ సినిమా కోసం త్రివిక్రమ్ కు భారీగానే…!

Published on Nov 17, 2020 3:03 PM IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేపట్టిన పలు క్రేజీ చిత్రాల్లో “అయ్యప్పణం కోషియం” రీమేక్ కూడా ఒకటి. దీనికి ముందే పలు సినిమాలు లైన్ లో ఉన్నప్పటికీ పవన్ నుంచి ఈ సినిమా ఉందని కన్ఫర్మేషన్ రావడంతో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. దీనితో ఈ చిత్రంకు సంబంధించి ఏ అంశం అయినా సరే మంచి హాట్ టాపిక్ గానే వినిపిస్తుంది.

అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు గాను పవన్ సన్నిహితుడు అలాగే టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందిస్తారన్న గాసిప్స్ వినిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇందుకు సంబంధించి మరింత సమాచారం కూడా వినిపిస్తుంది.

ఈ సినిమాకు గాను మాటలు అందించేందుకు నిర్మాణ సంస్థ భారీ స్థాయిలో 6 కోట్లు రెమ్యునరేషన్ త్రివిక్రమ్ కు ముట్టజెబుతున్నట్టుగా టాక్. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే థమన్ సంగీతం సమకూర్చనున్నారు.

తాజా వార్తలు