వైరల్ అవుతున్న మహేష్ స్టన్నింగ్ లుక్.!

వైరల్ అవుతున్న మహేష్ స్టన్నింగ్ లుక్.!

Published on Nov 17, 2020 9:00 AM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీ తో వెకేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే మన టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ హ్యాండ్సమ్ హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ ఖచ్చితంగా టాప్ లో ఉంటారు. ముఖ్యంగా అయితే ఏజ్ పెరిగే కొద్దీ మరింత హ్యాండ్సమ్ గా తయారవుతున్నారు తప్ప ఎక్కడా కూడా ఆ ఛాయలే కనిపించడం లేదు.

అందుకే మహేష్ అభిమానులు మాత్రమే కాకుండా ఇతర హీరోల జెన్యూన్ ఫ్యాన్స్ కూడా మహేష్ ఆల్ టైం హ్యాండ్సమ్ హీరో అని ఒప్పుకుంటారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా మహేష్ యొక్క ఓ ఫోటో సోషల్ మీడియాలో మరియు సినీ వర్గాల్లో వైరల్ అవుతుంది. ఓ ఎయిర్పోర్ట్ లో గ్యాప్ హూడితో గాగుల్స్ లుక్ లో మరింత యంగ్ గా కనిపిస్తూ ఓ ఫోటో బయటకొచ్చింది.

దీనితో ఈ ఫోటో సోషల్ మీడియాలో మంచి వైరల్ అయ్యిపోయింది. అంతే కాకుండా మహేష్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట” హ్యాష్ ట్యాగ్ తో మరింత స్థాయిలో మహేష్ ఫ్యాన్స్ ట్రెండ్ చేసారు. మొత్తానికి మాత్రం మహేష్ నయా లుక్ గట్టిగానే వైరల్ అవుతుంది. మహేష్ ఈ వెకేషన్ అనంతరం దర్శకుడు పరశురామ్ తో సర్కారు వారి పాట షూట్ కు సన్నద్ధం కానున్నారు.

తాజా వార్తలు