పవన్ పాత్రను పెంచే ప్రయత్నాలేవీ జరగట్లేదట

పవన్ పాత్రను పెంచే ప్రయత్నాలేవీ జరగట్లేదట

Published on Nov 17, 2020 3:01 AM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ షూటింగ్లో ఉన్నారు. అది ముగియగానే ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేయనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ఈ చిత్రం కోసం పవన్ సుమారు 40 రోజులు డేట్స్ కేటాయించారట. ఇందులో పవన్ బీజూ మీనన్ చేసిన పోలీస్ పాత్రను చేయనుండగా పృథ్వీ రాజ్ పోషించిన కోషియుమ్ పాత్రకు రానాను అనుకుంటున్నారు కానీ ఇంకా ఫైనల్ కాలేదు.
మామూలుగా అయితే పవన్ పెద్ద స్టార్ హీరో కాబట్టి ఆయన పాత్రను పెంచే ఆలోచనలు ఉండే అవకాశం ఎక్కువ. అభిమానుల కోసమైనా ఆ మార్పును చేయాలని అనుకుంటారు.

అయితే ఈ రీమేక్లో అలా చేయరట. ఒరిజినల్ వెర్షన్లో పాత్రలకు ఎలా అయితే సమానమైన వెయిట్ ఉంటుందో తెలుగులో కూడ అలానే ఉంటుందట. నిజానికి రెండు పాత్రలు సమానంగా ఉన్నాయి కాబట్టే ఒరిజినల్ వెర్షన్ అంత మంచి హిట్టైంది. సినిమాలోని గ్రిప్పింగ్ పాయింట్ కూడ అదే. ప్రధాన పాత్రలు రెండూ ఎక్కడా తగ్గవు. ఢీ అంటే ఢీ అన్నట్టు ఉంటాయి. అదే ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చింది. ఇప్పుడు అదే కిక్ తెలుగు ప్రేక్షకులకు కూడ కావాలంటే పవన్ పాత్రను రెండో పాత్రను సమానంగానే ఉంచాలి. అందుకే పాత్రల్లో ఎలాంటి మార్పు లేకుండా కేవలం సన్నివేశాల్లో మాత్రమే తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేస్తున్నారట. నిజంగా ఇది ఆహ్వానించదగిన పరిణామమే.

తాజా వార్తలు