విజయ్ సినిమాల్లో “మాస్టర్” టీజరే స్పెషల్ ఎందుకో తెలుసా.?

విజయ్ సినిమాల్లో “మాస్టర్” టీజరే స్పెషల్ ఎందుకో తెలుసా.?

Published on Nov 15, 2020 8:00 PM IST

మన దక్షిణాదిలో ఉన్న మోస్ట్ పవర్ ఫుల్ హీరోస్ లో ఇళయ థలపతి విజయ్ కూడా ఒకరు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో భారీ స్థాయి రికార్డులను సెట్ చెయ్యగలడు. అతని క్రేజ్ కు తగ్గట్టుగానే అతని అభిమానులు అంతే కసితో సెన్సేషనల్ రికార్డులు విజయ్ పేరిట నెలకొల్పుతారు. అలాగే లేటెస్ట్ గా విజయ్ నటించిన తాజా చిత్రం “మాస్టర్” టీజర్ కు చేసారు. ఇంకా 24 గంటలు దాటక ముందే 20 మిలియన్ కు పైగా వ్యూస్ మరియు 1.7 మిలియన్ లైక్స్ తో నెవర్ బిఫోర్ రికార్డ్స్ సెట్ చేసారు.

అయితే విజయ్ సినిమాలకు ఇది కామన్ గా మారింది కానీ ఈ మాస్టర్ టీజర్ మాత్రం ఖచ్చితంగా స్పెషల్ గా నిలుస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే విజయ్ నటించిన లాస్ట్ మూడు చిత్రాల్లో “మెర్సల్”, “సర్కార్” టీజర్స్ కు అభిమానులు ఇంతే స్థాయి రెస్పాన్స్ ను అందించారు. కానీ ఆ టీజర్స్ కు అంతే స్థాయిలో లక్షల్లో డిస్ లైక్స్ కూడా వచ్చి పడ్డాయి. రికార్డులు అన్నాక కేవలం పాజిటివ్ తో పాటు నెగిటివ్ ను కూడా చూడాలి. అలా ఈ రెండు సినిమాలకు లక్షల్లో డిస్ లైక్స్ పడ్డాయి.

కానీ మాస్టర్ టీజర్ కు మాత్రం వాటితో పోలిస్తే చాలా అంటే చాలా తక్కువే వచ్చాయి.24 గంటల్లో కేవలం కనీసం 20 వేలు కూడా పడలేదు. సో ఈ రకంగా మాస్టర్ టీజర్ మాత్రం ఈ ఒక్క విషయంలో స్పెషల్ గా నిలిచింది అని చెప్పాలి. (ఇక్కడ మేము విజయ్ నటించిన లాస్ట్ చిత్రం “బిగిల్”(విజిల్) కోసం ఎందుకు చెప్పలేదు అంటే దాని నుంచి కేవలం ట్రైలర్ మాత్రమే వచ్చింది. సర్కార్, మెర్సల్ సినిమాల నుంచి మాత్రమే టీజర్స్ వచ్చాయి.)

తాజా వార్తలు