బాలయ్య సినిమాలో సీనియర్ హీరో ?

బాలయ్య సినిమాలో సీనియర్ హీరో ?

Published on Nov 15, 2020 2:09 AM IST


నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో రానున్న సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ నటించబోతున్నాడని తెలుస్తోంది. ఈ భారీ యాక్షన్ సినిమాలో సీనియర్ బాలయ్యకు విలన్ పాత్ర ఉందని.. ఈ పాత్రలో రాజశేఖర్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట. అయితే సీనియర్ బాలయ్య క్యారెక్టర్ కేవలం రెండు సీన్స్ లో మాత్రమే ఉంటాడని.. ఆ క్యారెక్టర్ కి విలన్ గా ప్లాష్ బ్యాక్ లో రాజశేఖర్ కనిపిస్తున్నాడని తెలుస్తోంది. మరి రాజశేఖర్, బాలయ్య సినిమాలో ఏ లుక్స్ లో కనిపించబోతున్నాడో.. ఎలాంటి పాత్ర చేయబోతున్నాడో చూడాలి.

ఇక బాలయ్య యంగ్ క్యారెక్టర్ కి హీరోయిన్ మాత్రం దొరకడం లేదు. కొత్త హీరోయిన్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. అందుకే ఇంకా హీరోయిన్ ఫిక్స్ చేయకుండానే కరోనాకి ముందు ఈ మూవీకి సంబంధించిన ఒక యాక్షన్ షెడ్యూల్ ని కూడా ఫినిష్ చేశారు. త్వరలో జరిగే షూట్ లో కూడా హీరోయిన్ పార్ట్ కు సంబంధించిన సీన్స్ ను లేకుండా బోయపాటి షూట్ ప్లాన్ చేస్తున్నాడట. ఏమైనా బాలయ్యకి హీరోయిన్ సమస్య ప్రతి సినిమాకి ఉంటూ వస్తోంది. ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజా వార్తలు