మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చేస్తున్న ఆయన తర్వాత మెహర్ రమేష్, వివి.వినాయక్ లాంటి దర్శకులతో సినిమాలు చేయనున్నారు. వాటిలో వినాయక్ చేయనున్నది మలయాళం ‘లూసిఫర్’ తెలుగు రీమేక్. ‘ఆచార్య’ తర్వాత ఈ సినిమానే మొదలుపెట్టాలని చిరు ప్లాన్ చేసుకున్నారు. ఆ ప్రకారమే వినాయక్ ఒరిజినల్ స్రిప్ట్ ను తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా మారుస్తున్నారు. ప్రస్తుతం ఆ పనులే జరుగుతున్నాయి.
కానీ గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్ నుండి వినాయక్ తప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే కారణాలు ఏమిటనేది మాత్రం తెలియలేదు. మొదట సినిమాకు సుజిత్ కుమార్ డైరెక్షన్ అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఆయన ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ఆయన స్థానంలోకి వినాయక్ రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వినాయక్ కూడ ప్రాజెక్ట్ నుండి వెళ్ళిపోతున్నారని వార్తలు రావడంతో అభిమానులు కంగారుపడ్డారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలింది. సినిమాకు వినాయక్ డైరెక్షన్ చేయడం ఖాయమని రూఢీ అయింది. చిరు ఎంత త్వరగా ‘ఆచార్య’ చిత్రాన్ని ముగిస్తే అంత త్వరగా ఈ సినిమా మొదలవుతుంది.