వెంకీ లేని సీన్స్ కోసం ‘నారప్ప’ షూట్ ప్లాన్ !

వెంకీ లేని సీన్స్ కోసం ‘నారప్ప’ షూట్ ప్లాన్ !

Published on Oct 25, 2020 12:10 AM IST

విక్టరీ వెంకటేష్‌ ‘ఎఫ్‌2’, ‘వెంకీమామ’ వంటి వరుస బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ తరువాత చేస్తోన్న సినిమా ‘నారప్ప’. ఇప్పటికే ఈ సినిమా షూట్ పై వెంకీ క్లారిటీ ఇస్తూ కరోనా ప్రభావం తగ్గాకే షూటింగ్ ఉంటుందని తెలిపాడు. అయితే తాజాగా మేకర్స్ వెంకీ లేని సీన్స్ ను షూట్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట. ఒకవేళ షూట్ ప్లాన్ చేస్తే.. డిసెంబర్ నుండి చేయాలని.. జనవరి తరువాత ఎలాగూ వెంకీ షూట్ అంగీకారాన్ని తెలిపాడు కాబట్టి.. అప్పుడు వెంకీ సీన్స్ ను తీసుకోవచ్చు అని ప్లాన్ చేస్తున్నారట. ఇక లాక్ డౌన్ కి ముందు రిలీజ్ చేసిన ఈ చిత్రంలోని వెంకీ లుక్ కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ‘నారప్ప’గా విక్టరీ వెంకటేష్‌ లుక్‌ చాలా ఇంటెన్స్‌గా ఉంది. మాస్‌ గెటప్‌లో పూర్తి వైవిధ్యంగా కనిపిస్తూ సర్‌ప్రైజ్‌ చేశారు.

కాగా కరోనా ఎఫెక్ట్ తగ్గిన తరువాత రాయలసీమలోని అనంతపురం పరిసర ప్రాంతాల్లోని రియలిస్టిక్‌ లొకేషన్లలో కీలక సన్నివేశాలను తరువాత షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నారు. కాగా తమిళ్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా సంచలనం సృష్టించిన ‘అసురన్‌’ చిత్రానికి ఇది రీమేక్‌. ఈ చిత్రాన్ని శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి, వి క్రియేషన్స్‌ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విక్టరీ వెంకటేష్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సామ్‌.కె నాయుడు, సంగీతం: మణిశర్మ, ఎడిటర్ గా మార్తాండ్ కె. వెంకటేష్‌ పని చేస్తున్నారు.

తాజా వార్తలు