తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ విజయవంతంగా మూడు సీజన్లను పూర్తి చేసుకొని నాలుగో సీజన్లోకి అడుగు పెట్టింది. మొదట్లో కాస్త స్లోగనే స్టార్ట్ అయినా మెల్లగా ఎంటర్టైన్మెంట్ పెరగడంతో ఈ షోకు వీక్ డేస్ లో కూడా సాలిడ్ టీఆర్పి వచ్చింది. ఇదిలా ఉండగా బిగ్ బాస్ హౌస్ మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ను తెచ్చుకున్న మోస్ట్ లవ్డ్ కంటెస్టెంట్ గా యూట్యూబ్ సెన్సేషన్ గంగవ్వ నిలిచారు.
కానీ ఊహించని విధంగా గంగవ్వ ఆరోగ్యం పాడవడంతో ఆమె అక్కడ ఇమడలేక బయటకు వచ్చేసారు. దీనితో ఆమె ఆరోగ్యం పట్ల చాలా మందే కాస్త టెన్షన్ గా ఉన్నారు. అయితే ఇపుడు అందుతున్న సమాచారం ప్రకారం గంగవ్వ పూర్తిగా సేఫ్ గా ఉన్నారట. క్రమంగా ఆమె కోలుకుంటున్నారని వైద్యులు ఆమెకు ఒక వారం రోజులు రెస్ట్ తీసుకోవాలని సూచించారట. సో గంగవ్వ ఫ్యాన్స్ ఆమె ఆరోగ్యం పట్ల ఎవరూ చింతించాల్సిన పని లేదు.