లుంగీ లుక్ బంటు..వైరల్ అవుతున్నాడు.!

లుంగీ లుక్ బంటు..వైరల్ అవుతున్నాడు.!

Published on Oct 11, 2020 10:30 PM IST

ఈ మధ్య కాలంలో మన స్టార్ హీరోల తాలూకా పలు రేర్ అండ్ ఇది వరకు చూడని అన్ సీన్ ఫోటోలు చాలా బయటకొచ్చాయి. దాదాపు అందరి స్టార్ హీరోల నుంచి ఒకటి రెండు ఫోటోలు వచ్చాయి. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నుంచి కూడా పలు ఫొటోస్ వచ్చాయి.

అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “అల వైకుంఠపురములో” లో బంటు రోల్ కోసం ఎలాంటి మేకోవర్ లో వచ్చాడో చూసాము. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిలా కనిపించి బన్నీ ఆకట్టుకున్నాడు. కానీ ఇదే బంటు నుంచి లుంగీ లుక్ లో చాలా సింపుల్ గా ఉన్న ఒక అన్ సీన్ ఫోటో బయటకొచ్చింది.

అది కాస్తా ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ లో విపరీతంగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం బన్నీ రెండు భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్టులలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో సుకుమార్ తో తీస్తున్న “పుష్ప” షూట్ కు రెడీ అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు