“ఆదిపురుష్”లో సాలిడ్ రోల్ కోసం బడా స్టార్ పేరు.?

“ఆదిపురుష్”లో సాలిడ్ రోల్ కోసం బడా స్టార్ పేరు.?

Published on Oct 11, 2020 10:45 PM IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేపట్టిన బడా ప్రాజెక్టులలో హిందీ మరియు తెలుగు భాషల్లో ఏక కాలంలో తెరకెక్కనున్న చిత్రం “ఆదిపురుష్”. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ ప్లాన్ చేస్తున్న ఈ భారీ విజువల్ చిత్రంలో ప్రభాస్ రామునిగా కనిపించనున్నాడు. అలాగే ఈ రావణునిగా బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ను తీసుకున్న సంగతి తెలిసిందే.

రామాయణం ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం మేకర్స్ దృష్టిలో ఒక బడా స్టార్ హీరో పేరు లైన్ లో ఉన్నట్టు టాక్ సంతరించుకుంది. ఈ చిత్రంలో పవర్ ఫుల్ దేవుడు శివుని పాత్రకు గాను అజయ్ దేవ్ గన్ పేరును ఓంరౌత్ అండ్ టీం అనుకుంటున్నట్టు ఇపుడు గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి రోల్ కు అజయ్ పేరు సరైనదే అని చెప్పాలి.

మరి ఇది నిజమో కాదో అధికారిక అప్డేట్ వచ్చే వరకు ఆగాల్సిందే. ఈ చిత్రాన్ని ఓంరౌత్ 3డి లో తెరకెక్కించడమే కాకుండా దాదాపు 600 కోట్లకు పైగానే వ్యయంతో భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో నిర్మించనున్నారు. ఏది ఏమైనప్పటికీ మాత్రం “ఆదిపురుష్” టీం నుంచి ఒక అధికారిక అప్డేట్ రావాలి అంటే ప్రభాస్ పుట్టినరోజు వరకు ఆగక తప్పదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు