ఇక్కడ “కేజీయఫ్ 2″కు రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిపోయింది.!

ఇక్కడ “కేజీయఫ్ 2″కు రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిపోయింది.!

Published on Oct 11, 2020 10:12 PM IST

ఇపుడు మన దక్షిణాదిలోనే కాకుండా మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే మరోసారి “కేజీయఫ్ చాప్టర్ 2” చిత్రం మంచి హాట్ టాపిక్ అవుతుంది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ రాకీభాయ్ గా కేజీయఫ్ సెట్స్ లోకి అడుగు పెట్టాడు. దర్శకుడు ప్రశాంత్ నీల్ షూట్ ను పునః ప్రారంభం చేసి ముగించేసే పనిలో నిమగ్నం అయ్యుంటే మరోసారి ఈ చిత్రం అలా హాట్ టాపిక్ అవుతుంది.

అయితే ఈ భారీ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగా ఈ చిత్రాన్ని మేకర్స్ వచ్చే సంక్రాంతి రేస్ లో నిలపనున్నారని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తున్న నేపథ్యంలో డేట్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యిపోయినట్టు తెలుస్తుంది.

ఎందుకంటే ఇప్పటికే ఈ చిత్రం రిలీజ్ డేట్ ను బుక్ మై షో యాప్ లో అప్డేట్ చేసేసారు. ఈ సమాచారం ప్రకారం ఈ చిత్రం వచ్చే సంక్రాంతి రేస్ లోనే జనవరి 14న ఫిక్స్ చేసినట్టుగా చూపిస్తుంది. మరి మేకర్స్ నుంచి ఎలాంటి సమాచారం లేకుండానే అప్డేట్ చేసి ఉంటారని కూడా చెప్పలేం. మరి ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ అప్పుడే విడుదల అవుతుందా లేదా అన్నది చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు