ప్రభాసా, ఎన్టీఆరా అన్నది తేలేది అప్పుడే.?

ప్రభాసా, ఎన్టీఆరా అన్నది తేలేది అప్పుడే.?

Published on Oct 11, 2020 7:59 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆల్రెడీ పాన్ ఇండియన్ స్టార్ గా నిలదొక్కుకున్నాడు. అలాగే ఇపుడు పాన్ ఇండియన్ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వడానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా రెడీ అవుతున్నాడు. అయితే తారక్ పాన్ ఇండియన్ ఎంట్రీ పై మాత్రం చాలా మందికి అఙ్గతి నమ్మకం ఉంది.

తారక్ కూడా స్యూర్ షాట్ గా పాన్ ఇండియా మార్కెట్ లో నిలదొక్కుకోగలడని. అయితే మరి ఈ ఇద్దరు హీరోలతో సినిమా చేసే రేస్ లో రెడీ గా ఉన్న ఓ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. “కేజీయఫ్” తో పాన్ ఇండియా లెవెల్లో నీల్ ఉగ్ర రూపం చూపించాడు. దీనితో ఈ ఇద్దరి హీరోలతో సినిమా అనగానే విపరీతమైన హైప్ నెలకొంది.

అలాగే ఈ ఇద్దరి హీరోల్లో ఎవరితో నీల్ స్టార్ట్ చేయనున్నారా అన్నది కూడా మంచి సస్పెన్స్ గా మారింది. అయితే ప్రశాంత్ నీల్ మాత్రం తాను ఎవరితో స్టార్ట్ చేస్తారు అన్నది ప్రస్తుతం తెరకెక్కిస్తున్న “కేజీయఫ్ చాప్టర్ 2” షూట్ కంప్లీట్ అయ్యాక అనౌన్స్ చెయ్యాలని డిసైడ్ అయ్యినట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి నీల్ తో ప్రభాసా? ఎన్టీఆరా అన్నది తేలేది కేజీయఫ్ తర్వాతే..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు