తారక్, త్రివిక్రమ్ ల మాస్ విశ్వరూపానికి రెండేళ్లు.!

తారక్, త్రివిక్రమ్ ల మాస్ విశ్వరూపానికి రెండేళ్లు.!

Published on Oct 11, 2020 3:05 PM IST

మన టాలీవుడ్ లోనే కాకుండా మన దక్షిణాదిలోనే మాస్ ఆడియెన్స్ ను విపరీతంగా ఆకర్శించగలిగే హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. ఒక సరైన మాస్ సినిమా పడితే తారక్ బాక్సాఫీస్ హవా ఆపడం కష్టమే. అలాంటి తారక్ కెరీర్ లో మాస్ యాంగిల్ లోనే ఒక సరికొత్త కోణాన్ని రుచి చూపించిన చిత్రం “అరవింద సమేత వీర రాఘవ”. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా అంటే ముందు అంతా సింపుల్ గా ఉంటుంది అనుకున్నారు.

కానీ ఒక్కసారిగా పోస్టర్స్ టీజర్స్ చూసాక తారక్ ఫ్యాన్స్ సహా టోటల్ టాలీవుడ్ వర్గాలకే ఊహించని షాక్ లా తగిలింది. అసలు త్రివిక్రమ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అన్న రేంజ్ లో టాక్ వచ్చింది.సరికొత్త ఫ్యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా స్టార్టింగ్ 30 నిమిషాలు అయితే తారక్ ఫ్యాన్స్ ఇది వరకు ఎన్నడూ చూడని మాస్ ఫీస్ట్ ను త్రివిక్రమ్ చూపించారు. దీనితో ఈ కాంబో అంటే తారక్ ఫ్యాన్స్ లో ఒక సెపరేట్ క్రేజ్ ఏర్పడిపోయింది.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం గత రెండేళ్ల కితం సరిగ్గా ఇదే 11వ తేదీన రిలీజ్ అయ్యి తారక్, త్రివిక్రమ్ ల మాస్ విశ్వరూపాన్ని చూపింది. ఇక సంగీత దర్శకుడు థమన్ కు ఈ చిత్రం అయితే పెద్ద బ్రేక్ అని చెప్పాలి. నెవర్ బిఫోర్ సాంగ్స్ మాత్రమే కాకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో కానీ సరికొత్త మాస్ యుఫొరియాను సృష్టించాడు. దీనితో ఈ రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తారక్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తుండగా మేకర్స్ కూడా ఆ రోజులను గుర్తు చేసుకుంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు