బాలీవుడ్ వర్గాల్లో “సాహో” రికార్డ్స్ సేఫ్..!

బాలీవుడ్ వర్గాల్లో “సాహో” రికార్డ్స్ సేఫ్..!

Published on Oct 11, 2020 12:52 AM IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడు అన్న సమయంలో ఊహించని విధంగా యంగ్ డైరెక్టర్ సుజీత్ తో “సాహో” అనే ఒక భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ను తెరకెక్కించాడు. అయితే ఈ చిత్రం విడుదలయ్యాక బాలీవుడ్ లో ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే.

బాలీవుడ్ జనాన్ని విపరీతంగా ఆకర్షించిన ప్రభాస్ తన దమ్మెంతో అక్కడ జనంలో క్రేజ్ ఎలా ఉందో ఆ సినిమా టీజర్ మరియు ట్రైలర్ లతో చూపించాడు. శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ట్రైలర్ నెలకొల్పిన రికార్డు మాత్రం ఇంకా అలా పదిలంగానే ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

సింగిల్ యూట్యూబ్ ఛానెల్లో రిలీజ్ కాబడిన ఈ చిత్రం హిందీ వెర్షన్ ట్రైలర్ ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా 32 మిలియన్ వ్యూస్ సాధించి భారీ రికార్డును సెట్ చేసింది. దీనిని లేటెస్ట్ గా అక్షయ్ కుమార్ నటించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం లక్ష్మీ బాంబ్ ట్రైలర్ ట్రైలర్ కూడా టచ్ చెయ్యలేకపోయింది అని ఇదే బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. వితౌట్ ప్రమోషన్స్ లో కూడా ప్రభాస్ సెట్ చేసిన రికార్డ్స్ ఇంకా అలా పదిలంగానే ఉన్నాయి అంటే అక్కడ డార్లింగ్ హవా ఏ రేంజ్ లో ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు