“పోకిరి” నా ఫేవరెట్..పూరిపై విజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

“పోకిరి” నా ఫేవరెట్..పూరిపై విజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on Oct 10, 2020 1:03 PM IST

ఇపుడున్న యువ హీరోల్లో రౌడీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ కూడా ఒకడు. యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ హీరో అలాంటి యూత్ ను ఒక ఊపు ఊపేసే దర్శకుడు పూరి జగన్నాథ్ తో ఒక సినిమాను అనౌన్స్ చెయ్యడం అందులోనూ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా దాన్ని ప్రకటించడంతో ఈ మాస్ కాంబో కోసం చాలా మందే ఎదురు చూస్తున్నారు. పక్కా కమర్షియల్ చిత్రం గా ప్లాన్ చేసిన ఈ ప్రాజెక్ట్ కు “ఫైటర్” గా నామకరణం చేసారు.

అయితే ఈ స్పెషల్ సినిమా కోసం మరియు దర్శకుడు పూరి కోసం విజయ్ దేవరకొండ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. పూరి అంతే తనకు ఎప్పటి నుంచో ఇష్టమని పూరి తీసిన సినిమాల్లో మహేష్ తో చేసిన “పోకిరి” అయితే నా ఫేవరెట్ అని విజయ్ తెలిపాడు. అంతే కాకుండా నేను ఎప్పుడు ఇలాంటి కమర్షియల్ సినిమా చెయ్యలేదు అందుకే ఈ చిత్రం నాకు చాలా స్పెషల్ అని ఇలాంటి సినిమా కోసమే ఎదురు చూస్తున్నానని విజయ్ తెలిపాడు.

అలాగే ఈ సినిమా కోసం కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా విజయ్ చెప్పాడు. ఈ సినిమాలో రోల్ కోసం తాను ఎనిమిది నెలల నుంచి వర్కౌట్స్ చేస్తున్నాని అలాగే ఈ సినిమాలో సిక్స్ పాక్స్ లేదా ఎయిట్ పాక్స్ లో కనిపిస్తానని తెలిపాడు. అలాగే ఇది అన్ని రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లా మా స్టైల్ కమర్షియల్ సినిమాలా ఉంటుందని విజయ్ అన్నాడు. మంచి అంచనాలను ఏర్పర్చుకున్న ఈ చిత్రంలో విజయ్ సరసన అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుండగా కరణ్ జోహార్ మరియు చార్మీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు