ఇంకో నాలుగు నెలలు పూర్తయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే పేరు సిల్వర్ స్క్రీన్ పై పడి మూడేళ్లు అయ్యిపోతుంది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు మధ్యలో పవన్ పుట్టినరోజులు మాత్రం పెద్ద హడావుడి లేకుండానే జరిగిపోయాయి. కానీ..ఈసారి మాత్రం రచ్చ లేవనుంది అని చెప్పాలి.
ఎందుకంటే పవన్ నటిస్తున్న చిత్రాలకు సంబంధించి అప్డేట్స్ వరుస పెట్టి వస్తుండడంతో ఒకప్పటి రోజులు మళ్లీ పవన్ అభిమానులకు వచ్చినట్టు అయ్యింది. దీనితో ఈ సెప్టెంబర్ 2 న పవన్ పుట్టినరోజు వేడుకలు మరో స్థాయిలో ఉండేలా పవన్ అభిమానులు ప్లాన్ చేస్తున్నారు. సోషల్ మీడియా మరియు సినీ వర్గాల్లో కూడా పవన్ సినిమాలతోనే టాపిక్ తోనే టైం లైన్స్ నిండిపోతున్నాయి. దీనితో మళ్లీ ఇన్నాళ్లకు పవర్ స్టార్ ఫీవర్ మళ్లీ మొదలయ్యింది అని చెప్పాలి.