పెళ్లి చేసుకోను అంటున్న పాప్యులర్ హీరోయిన్

పెళ్లి చేసుకోను అంటున్న పాప్యులర్ హీరోయిన్

Published on Jul 31, 2020 3:05 AM IST


శ్రీమహాలక్ష్మీ అనే చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన పూర్ణ, అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సీమ టపాకాయ్ మూవీతో మంచి పాప్యులర్ అయ్యింది. ఆ మూవీ తరువాత ఆమె రవిబాబు తెరకెక్కించిన హారర్ సిరీస్ అవును, అవును 2 చిత్రాలలో కూడా నటించింది. సౌత్ లోని అన్ని భాషలలో నటించిన ఈ మలయాళ నటి కన్నడ, తమిళ్ మరియు మలయాళ భాషలలో నటిస్తుంది. ఐతే ఈ మధ్య కొందరు యువకులు వేధింపులకు పాల్పడ్డారని ఆమె పిర్యాదు చేయడం జరిగింది.

అలాగే ఓ ముఠా ఆమెను పెళ్లిపేరుతో మోసం చేయాలని చూశారట. తనని మరియు కుటుంబ సభ్యులను ఛీట్ చేయాలనుకున్నారని ఆమె చెవుతున్నారు. దీనితో పూర్ణకు అసలు పెళ్లిపై ఆసక్తి పోయిందట. పూర్ణ పేరెంట్స్ తో అసలు పెళ్లిచేసుకోనని చెప్పానని అని అంటున్నారు. ప్రస్తుతం పూర్ణ తమిళ్, మలయాళ మరియు కన్నడ భాషలలో కలిపి 4 సినిమాల వరకు చేస్తున్నారు.

తాజా వార్తలు