ఈసారి సంక్రాంతి యంగ్ హీరోలదేనా?

ఈసారి సంక్రాంతి యంగ్ హీరోలదేనా?

Published on Jul 30, 2020 8:05 AM IST

కరోనా వలన మూవీ షూటింగ్స్ కి పూర్తిగా బ్రేక్ పడింది. ఇక స్టార్ హీరోలైతే షూటింగ్స్ లో పాల్గొనేది లేదని తేల్చి చెప్పేశారు. దీనితో 2021 సంక్రాంతికి స్టార్ హీరోల సందడి ఉండే దాఖలాలు కనిపించడం లేదు. ఆర్ ఆర్ ఆర్, ఆచార్య, రాధే శ్యామ్, పుష్ప, సర్కారు వారి పాట ఈ చిత్రాలన్నీ 2021సమ్మర్ తరువాత మాత్రమే విడుదల కానున్నాయి. 20రోజుల షూటింగ్స్ మాత్రమే మిగిలిఉన్న నేపథ్యంలో పవన్ వకీల్ సాబ్ సంక్రాంతికి వచ్చే అవకాశం ఉంది. అది కూడా ఖచ్చితంగా చెప్పలేము.

దీనితో 2021 సంక్రాంతి పై యంగ్ హీరోలు కన్నేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే హీరో నితిన్ తన లేటెస్ట్ మూవీ రంగ్ దే సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే అక్కినేని వారసుడు అఖిల్ నాలుగవ చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీ కూడా సంక్రాంతి ని టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. అలాగే హీరో శర్వానంద్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ శ్రీకారం మూవీ సైతం సంక్రాంతికి రానుందని సమాచారం. కాబట్టి 2021 సంక్రాంతి యంగ్ హీరోలదే అనే టాక్ వినిపిస్తుంది.

తాజా వార్తలు