రాకీ భాయ్ కి షాక్ ఇచ్చేలా విలన్ అధీరా లుక్

రాకీ భాయ్ కి షాక్ ఇచ్చేలా విలన్ అధీరా లుక్

Published on Jul 29, 2020 10:20 AM IST

ముందుగా ప్రకటించిన విధంగా కెజిఎఫ్ చాఫ్టర్ 2 నుండి ప్రధాన విలన్ అధీరా లుక్ ని చిత్ర యూనిట్ విడుదల చేశారు. భిన్నమైన హెయిర్ స్టయిల్, శరీరమంతా టాటూలతో భయకంగా ఉన్న అధీరా ఓ పెద్ద ఖడ్గాన్నీ చేతిలో పట్టుకొని ఉన్నారు. అధీరాగా సంజయ్ దత్ లుక్ కేక పుట్టించేదిగా ఉంది. ఆయనను చూస్తుంటే కిల్లింగ్ మెషిన్ రాఖీ భాయ్ కి కూడా షాక్ ఇచ్చేలా ఉన్నాడు. ప్రాణాంతక వైకింగ్స్ స్పూర్తితో అధీరా పాత్రను రూపొందించినట్లు చిత్ర యూనిట్ చెవుతున్నారు.

ఇక కెజిఎఫ్2 లో రాఖీ భాయ్ రోల్ చేస్తున్న యష్ కి అధీరాగా చేస్తున్న సంజయ్ దత్ కి మధ్య పోరాటాలు ఓ రేంజ్ లో ఉంటాయని అనిపిస్తుంది. అలాగే విలన్ ఈ స్థాయిలో ఉంటే ఇక రాఖీ భాయ్ ఏ రేంజ్ లో ఉంటాడో అనే ఆసక్తిపెరిగిపోతుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. అక్టోబర్ 23న విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు.

తాజా వార్తలు