గ్యాంగ్ స్టర్ గా కేకపుట్టించిన స్టార్ హీరో.

గ్యాంగ్ స్టర్ గా కేకపుట్టించిన స్టార్ హీరో.

Published on Jul 29, 2020 2:02 AM IST


సౌత్ తోపాటు బాలీవుడ్ లో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ హీరో దుల్కర్ సల్మాన్. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి సినీ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన సల్మాన్ దూసుకుపోతున్నాడు. మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు దుల్కర్ . ఇక ఇటీవల విడుదలైన కనులు కనులను దోచాయంటే మూవీ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కాగా నేడు దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన కురుప్ టీజర్ రిలీజ్ చేసారు.

ఈ మూవీలో దుల్కర్ ఓ గ్యాంగ్ స్టర్ రోల్ చేస్తున్నారు. 1980లో కేరళ ప్రాంతాన్ని వణికించిన సుకుమార కురుప్ అనే క్రిమినల్ జీవితం ఆధారంగా ఈ మూవీ రూపొందించబడింది. సుకుమార కురుప్ పాత్రలో దుల్కర్ నటించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించాడు. ఈ చిత్రానికి శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్ మంచి ఆదరణ తెచ్చుకోగా ఇప్పుడు టీజర్ కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది.

https://www.instagram.com/p/CDLHB2RplUW/

తాజా వార్తలు