ఎంట్రీ ఈజీ, కొనసాగడమే కష్టం..!

ఎంట్రీ ఈజీ, కొనసాగడమే కష్టం..!

Published on Jul 28, 2020 10:03 PM IST

హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత బాలీవుడ్ లో నెపోటిజంపై విమర్శలు రేగాయి. బంధుప్రీతి వలన కొందరు పెద్దలు, ఎటువంటి సినిమా నేపథ్యం లేకుండా సినిమాలలోకి వచ్చిన వారిని తొక్కేస్తున్నారని ఆరోపణలు చేయడం జరిగింది. బాలీవుడ్ లో ఈ విషయంపై కంగనా రనౌత్ మరియు తాప్సి వంటి వారి మధ్య పెద్ద యుద్ధమే నడుస్తుంది. ఐతే కాగా ఇదే విషయంపై హీరోయిన్ శృతి హాసన్ స్పందించారు. పరిశ్రమలో గాడ్ ఫాదర్ ఉండడం వలన మనకు ఎంట్రీ ఈజీ అవుతుంది. స్ట్రగుల్స్ లేకుండానే అవకాశం దక్కించుకోవచ్చు. కానీ పరిశ్రమలో నిలబడాలి అంటే మనల్ని మనం నిరూపించుకోవాల్సిందే. ప్రతిభ లేకుండా రాణించడం కష్టం అన్నారు.

శృతి హాసన్ కి కూడా గాడ్ ఫాదర్ గా హీరో కమల్ హాసన్ ఉన్నారు. ఆయన ప్రోత్సహంతోనే ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. శృతి హాసన్ చెల్లి అక్షరా హాసన్ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆమె మాత్రం సక్సెస్ కాలేకపోయింది. శృతి చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది. ఏళ్లుగా అనేక మంది వారసులు పరిశ్రమకు పరిచయం అయ్యారు. వారిలో కొందరు మాత్రమే నిలబడ్డారు.

తాజా వార్తలు